ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమగ్ర నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అలాగే, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది.