సాధికారత ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

సాధికారత ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

ADB: రైతు సాధికారత ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో 4వ సర్వసభ్య సమావేశం అంకోలి గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించారు. ఈ రైతు సాధికారత సంఘంలో 531 మంది సభ్యులు వాటాదారులుగా ఉన్నారని ఆ సంఘం మేనేజర్ తెలిపారు. అనంతరం సంఘం మేనేజర్ మురళి మాట్లాడుతూ.. రైతు సాధికారత సంఘం నుంచి నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను రైతులకు అందిస్తున్నామన్నారు.