తాళ్లూరు వద్ద బైక్ అదుపుతప్పి గాయాలు
ప్రకాశం: తూర్పు గంగవరం-చీమకుర్తి ప్రధాన రహదారిలోని గుంటిగంగమ్మ సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లూరు మండలం దోసకాయలపాడు గ్రామానికి చెందిన రామయ్య, చీమకుర్తి నుంచి వస్తూ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కుడి కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో వీడియో తీసిన ఒక వ్యక్తి స్పందించి, క్షతగాత్రుడిని తూర్పు గంగవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.