'నూతన చట్టాలను రద్దు చేయాలి'
ప్రకాశం: హనుమంతునిపాడు మండల కేంద్రంలో మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నూతనంగా తీసుకొచ్చిన 197 చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట జీవోను దగ్ధం చేశారు. ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం 2005లో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.