పాతకక్షలతో విద్యార్థిపై ఘాతుకం.. 5గురు అరెస్ట్
నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో పాతకక్షలతో 10వ తరగతి విద్యార్థి సుశాంత్‌పై మోహన్, రాఫీ గ్యాంగ్ కత్తులతో దాడికి పాల్పడ్డారు. గణతంత్ర వేడుకల నాడు జరిగిన ఈ ఘటనలో ఐదుగురిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి, రౌడీ షీట్లు తెరిచారు. వీరి నుంచి 2 బైకులు, 3 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.