సర్టిఫికెట్ కోసం వికలాంగుడి ఆవేదన..!
PLD: నకరికల్లు మండలం, గుండ్లపల్లి గ్రామానికి చెందిన చికిలి అల్లా నబి (41) వికలాంగుల నియామకాలకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో 5వ తరగతి మార్కుల జాబితా కోసం కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత రికార్డులు అందుబాటులో లేవని అధికారులు పేర్కొనగా, తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభ్యర్థి తెలిపారు. సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.