పశు దవాఖానాలపై చిన్నచూపు!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పశు దవాఖానాలపై నిర్లక్ష్యం నెలకొంది. చాలా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరోవైపు సిబ్బంది కొరతతో పాడి రైతులకు సేవలు అందడం లేదు. పశుసంవర్ధక శాఖలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు గాను కేవలం ఐదుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 32 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 21 ఖాళీలు ఉన్నాయి. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని రైతన్నలు కోరుతున్నారు.