జూలకల్లులో పోలీసుల కార్డెన్ సెర్చ్

జూలకల్లులో పోలీసుల కార్డెన్ సెర్చ్

పల్నాడు: పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో మంగళవారం పోలీసులు విస్తృతమైన కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పలువురు పోలీస్ సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. పోలీసులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీలు కూడా చేపట్టారు. ఈ తనిఖీల సందర్భంగా అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్న మారణాయుధాలు, ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు.