రాయదుర్గంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
ATP: రాయదుర్గం పట్టణంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. సోమవారం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ రాష్ట్ర నేతలు, చైర్మన్, కౌన్సిలర్లు ఉన్నారు.