మార్కాపురంలో వడగాల్పులు.. జర జాగ్రత్త..!

మార్కాపురంలో వడగాల్పులు.. జర జాగ్రత్త..!

ప్రకాశం: ఉత్తరాంధ్రలో భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో 35 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మార్కాపురంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు మధ్యాహ్నం వేళ బయటకి రావొద్దని హెచ్చరించింది.