VIRAL: ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండని దేశం భూటాన్!
మీకు తెలుసా?.. భూటాన్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. రాజధాని థింపూలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మధ్యలో నిలబడి వాహనాలను నియంత్రిస్తారు. వాహనాలు తక్కువ వేగంతో వెళ్లడం వల్ల ప్రమాదాలు కూడా తక్కువగా జరుగుతాయి. ట్రాఫిక్ లైట్ ఏర్పాటుకు ప్రయత్నించినా, ప్రజలు దానిని స్వీకరించక, ట్రాఫిక్ పోలీసుల నియంత్రణనే ఇష్టపడ్డారు. ఆటోమేషన్ మనుషుల మధ్య సంబంధాలను తగ్గిస్తుందని వారు నమ్ముతారు.