రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని ఘరానా మోసం
ప్రకాశం: ఒంగోలు సంతపేటకు చెందిన ఓ మహిళ, తన కుమారుడికి రైల్వే టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని ఒంగోలు రైల్వే పార్శిల్లో పనిచేసే వ్యక్తి మోసం చేశాడని ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారుటీసీ ఉద్యోగం కోసం రూ. 4 లక్షలు తీసుకున్న ఆ వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని బాధితురాలు వాపోయారు.