'ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలి'
MNCL: సమాజ హితం కోరి ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని SC,ST కమిషన్ సభ్యులు ప్రవీణ్ పిలుపునిచ్చారు. ఆదివారం బెల్లంపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో మున్సిపల్ ఛైర్ పర్సన్‌తో పాటు స్వాతితో కలిసి పాల్గొన్నారు. అవయవ దానం చేసిన కుటుంబాలను ఆయన సన్మానించారు. అంగీకార పత్రాలను స్వీకరిస్తూ మరణానంతరం మరొకరికి చూపునివ్వడం, ప్రాణం పోయడం గొప్ప విషయమన్నారు.