వెలగని వీధి లైట్లతో గ్రామస్థుల ఇబ్బందులు

వెలగని వీధి లైట్లతో గ్రామస్థుల ఇబ్బందులు

సత్యసాయి: పెనుకొండ మండలం కోనాపురంలో వీధి లైట్లు లేక గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 5 నెలల నుంచి వీధి లైట్లు వెలగడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. రాత్రి వేళ పాములు వస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.