VIDEO: బండి, ఈటల మధ్య ఫ్లెక్సీల వివాదం
కరీంనగర్‌లో ఎంపీ ఈటల రాజేందర్ ఫోటో లేకుండా బండి సంజయ్ అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మత అంశాలపై ఈటల–బండి మధ్య పరోక్ష విమర్శలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో మత రాజకీయాలు పనికిరావని ఈటల వ్యాఖ్యానించగా, తనకు మతం, సంప్రదాయం, సనాతన ధర్మమే బలం అని బండి సంజయ్ ప్రతిస్పందించారు.