ఖాళీపోస్టుల దరఖాస్తుల ఆహ్వానం
SRD: హత్నూర మండలం గుండ్లమాచునూర్ శివారులోని బాలికల వసతి గృహంలో గల పలు ఖాళీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి జయలక్ష్మి తెలిపారు. వసతి గృహంలో హెడ్ కుక్, చౌకీదార్ పోస్టులకు పదో తరగతి అర్హత, అసిస్టెంట్ కుక్ పోస్టుకు 7వ తరగతి అర్హతకలిగి ఆసక్తిగల వారు ఈనెల 30లోపు వసతి గృహంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.