కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో వామపక్ష కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. చట్టాలను సవరించి పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.