బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

CTR: బంగారుపాళ్యం మండలంలో శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లేడుపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన చంగల్ రెడ్డి(80) నలగాంపల్లె దగ్గర నడిచి రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు బస్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను బంగారుపాళ్యం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యంకోసం చిత్తూరుకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.