శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: కొత్తూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల స్వయం ఉపాధి పొందేందుకు ఈ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు.