మధుమేహంపై అవగాహన కార్యక్రమం
సత్యసాయి: జిల్లా DMHO కార్యాలయంలో ఇవాళ 'ప్రపంచ మధుమేహ దినోత్సవం' (World Diabetes Day) సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మధుమేహం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయవలసిన ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించారు.