'నీళ్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు'

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మిషన్ భగీరథ పనులను జడ్పీ సీఈవో స్వయంగా పర్యవేక్షించారు. ఎంపీడీవో పూర్వ చంద్రకుమార్, ఈవో రమేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా గౌడ్, డైరెక్టర్ తోట రమేష్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీళ్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నీటి సమస్య ఉందని తెలిపారు.