ఓపెన్ఏఐ నియామకాలు.. దరఖాస్తుల ఆహ్వానం

ఓపెన్ఏఐ నియామకాలు.. దరఖాస్తుల ఆహ్వానం

చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ భారత మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఈ మేరకు భారత్‌లో తన సేవలను విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా మన దేశంలో ఇంజనీర్ల నియామకాలు ప్రారంభించింది. అయితే, ఎంతమందిని నియమిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. బెంగళూరు వేదికగా కార్యకలాపాలను విస్తరించాలనే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.