KGBVలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
PPM: కురుపాం కేజీబీవీ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఐ.కిరణ్ కుమారి తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్(ఎంపీసీ) మొదటి సంవత్సరంలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్1 వరకు https://apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.