చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

NRPT: ధన్వాడ మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర శనివారం సర్పంచ్ జ్యోతి రామచంద్రయ్య రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎండల తీవ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులకు, ప్రయాణికులకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.