తీగల వంతెన నిర్మాణం.. నిలిచిపోనున్న రాకపోకలు
ఖమ్మం కాల్వఓడ్డు మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో పాత బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 29, 30వ తేదీ ఉ.11 గంటల నుంచి సా.5 గంటల వరకు మున్నేరు పాత వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి ఆయా సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు.