నౌపడలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక

SKLM: సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1982-83 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలతో సందడి చేశారు. ఉపాధ్యాయులు చెన్నూరు విజయానంద రాజా, రామముని కృష్ణారావు శర్మలను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.