అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఏసీపీ ప్రకాశ్

KNR: కరీంనగర్ మానేరు పరివాహక ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శుభం ప్రకాశ్ తెలిపారు. నిర్మాణాలు చేసేవారు, బిల్డర్స్ ప్రభుత్వ అనుమతి లేని ఇసుకను కొనరాదని, అక్రమంగా ఇసుకను కొనుగోలు చేస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణ చేసే వాహన డ్రైవర్లపై, ఓనర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.