గొర్రెల మందపై దాడి చేసిన కుక్కలు

గొర్రెల మందపై దాడి చేసిన కుక్కలు

NDL: సిరివెళ్ల(M) ఎర్రగుంట్ల మేజర్ గ్రామపంచాయతీలో గొర్రెల మందపై మంగళవారం కుక్కలు దాడి చేశాయి. దీంతో చాకలి మల్లికార్జునకు చెందిన 5 పొట్టేళ్లు మృత్యువాత పడగా, మరో రెండు అస్వస్థతకు గురయ్యాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు కుక్కల బెడదను అరికట్టి పాడి పశువులు, మూగజీవులను రక్షించాలన్నారు.