రోడ్డు ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం

రోడ్డు ప్రమాద బాధితుడికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం

ASR: ఎటపాక మండలంలోని నెల్లిపాక గ్రామానికి చెందిన వీకే శివ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై, భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యానికి రూ. 2.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో, దాతల సహాయం కోసం ఎదురుచూసింది. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి రూ. 2.5లక్షల ఎల్ఓసీని ఇప్పించారు. ఈ మేరకు MLAకు శివ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.