WPL ఫైనల్‌లో రెండు వికెట్లు తీసిన కడప జిల్లా అమ్మాయి

KDP: ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL) ఫైనల్ శనివారం జరిగింది. ఈ ఫైనల్లో ముంబై ఇండియన్స్, డిల్లీ క్యాపిటల్స్ తలపడగా ముంబై గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో మన కడప జిల్లా ఎర్రగుంట్లలోని ఆర్డీపీపీకి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి డిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడింది. ముందుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లకు 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 4 బంతులకు 3 పరుగులు చేసింది.