ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

SRPT: జిల్లాలోని అన్ని మండలాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపాలని డీఈవో అశోక్ గురువారం తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న జిల్లా సాయి అవార్డులు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనలను ఈనెల 25 లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని చెప్పారు.