పాముకాటుతో చిన్నారి మృతి
కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని పెదపాలెం గ్రామంలో పాముకాటుతో ఓ 18 నెలల పసికందు మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లోయ పల్లవి అనే చిన్నారి ఆడుకుంటుండగా పాముకాటుకు గురైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా, మార్గమధ్యలో మృతి చెందింది. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.