BRSలో చేరాలని నిర్ణయించుకున్నా: జీవన్ రెడ్డి
TG: తాను BRSలో చేరాలని నిర్ణయించుకున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో 27 నెలలుగా చాలా క్షోభ అనుభవించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచిందన్నారు. 2014లో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం వచ్చినా.. కాంగ్రెస్‌లోనే కొనసాగానన్నారు. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు BRSతో కలిసి పనిచేస్తానని చెప్పారు.