రేపు 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక
SRPT: ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం నిర్వహించే మండల స్థాయి సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. పథకాలపై అవగాహనతో పాటు పారిశుధ్యం, ఫైల్ క్లియరెన్స్‌పై దృష్టి పెట్టాలన్నారు. రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించాలని, కార్యాలయాల్లో ‘నో హెల్మెట్ - నో ఎంట్రీ’ నిబంధన అమలు చేయాలని సూచించారు.