క్రీడల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
MDK: తూప్రాన్ గురుకుల పాఠశాల విద్యార్థులు వినోద్, రాకేష్‌లు ఫిస్ట్ బాల్ పోటీలలో విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపాల్ సుహాసిని తెలిపారు. బోయిన్‌పల్లి కళాశాల ఆవరణలో జరిగిన 9వ జూనియర్ ఫిస్ట్ బాల్ ఛాంపియన్ షిప్ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికైనట్టు వివరించారు. డిసెంబర్‌లో జరిగే జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొంటారని వివరించారు.