రహదారి నిబంధనలు పాటించాలి

ASR: వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని కొయ్యూరు ఎస్సై పీ.కిషోర్ వర్మ సూచించారు. మంగళవారం సిబ్బందితో కలిసి కాకరపాడు జంక్షన్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతీ వాహనం నిలిపి వేసి క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచి పెట్టారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలన్నారు.