'విజయ్ దివాస్' ఘనంగా చేపట్టాలి: మాజీ ఎమ్మెల్యే
WGL: డిసెంబర్ 9వ తేదీన 'విజయ్ దివాస్' కార్యక్రమాన్ని నిర్వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9ను 'విజయ్ దివాస్'గా నిర్వహించుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా నియోజకవర్గంలో నిర్వహించాలని తెలిపారు.