మెట్రో డీలక్స్‌కు కాంబినేషన్ టికెట్

మెట్రో డీలక్స్‌కు కాంబినేషన్ టికెట్

HYD: బస్సు పాస్ దారుల కోసం ఆర్టీసీ మెట్రో కాంబో టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ నెలవారి బస్సు పాస్ దారులు రూ. 20 చెల్లించి మెట్రో డీలక్స్ బస్సుల్లో ఒక ట్రిప్పు వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, గ్రేటర్ పరిధిలో 200 మెట్రో డీలక్స్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.