జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
SRCL: చలి తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా రోజురో జుకు చలి పెరుగుతుండడంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 8.4 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలుగా నమోదయింది. అత్యల్పంగా రుద్రంగిలో 8.4 డిగ్రీలు నమోదు కాగా, బోయిన్పల్లిలో 9.1 డిగ్రీలు, తంగళ్ళపల్లిలో 9.3డిగ్రీలు, వేములవాడ రూరల్లో 9.4 డిగ్రీలు, నమోదైనట్లు తెలిపారు.