VIDEO: వేంపల్లి రైల్వే బ్రిడ్జ్‌పై చిరుత పులి సంచారం
ASF: సిర్పూర్ టీ మండలంలోని వేంపల్లి రైల్వే బ్రిడ్జ్‌పై చిరుత పులి సంచారం కలకలం రేపింది. వాహనదారుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సమాచారం అందించగా, వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని బ్రిడ్జ్‌పై కనిపించిన అడుగులను పరిశీలించారు. అవి చిరుత పులివేనని నిర్ధారించారు. భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.