జాతీయ రహదారిపై ప్రమాదం.. బీటెక్ విద్యార్థి మృతి

GNTR: మార్టూరు మండలం కోలలపూడి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై దుర్ఘటన జరిగింది. మేడికొండూరు మండలం డోకిపర్రుకి చెందిన భరణ్ (19), ప్రవీణ్ అనే యువకులు బైక్‌పై ఒంగోలు నుంచి వస్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరణ్ తీవ్రంగా గాయపడి మార్గమధ్య లో మృతిచెందాడు. ప్రవీణ్ గాయాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.