తలతంపరలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
SKLM: కంచిలి మండలం తలతంపర పంచాయతీ గ్రామాల్లో శుక్రవారం పారిశుద్ధ్య పనులను సిబ్బంది ముమ్మరంగా నిర్వహించారు. సర్పంచ్ జగబంధు దొలాయి ఆధ్వర్యంలో కార్మికులు గ్రామాల్లో కాలువల్లో పూడికలు తీసి, ప్లాస్టిక్ వ్యర్ధాలను వేరు చేశారు. ఈ మేరకు నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ వేసి దోమలు, ఈగల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు హెచ్చరించారు.