రాయచోటిలో వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై

రాయచోటిలో వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై

అన్నమయ్య: SP ఆదేశాల మేరకు, శుక్రవారం రాయచోటి సీఐ చలపతి ఆధ్వర్యంలో ఎస్సై విష్ణువర్ధన్ ద్విచక్ర వాహనదారులపై తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించారు. అనంతరం మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లితండ్రులపై చట్టపరమైన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరించారు.