నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ప్రకాశం: ఒంగోలులో నగరంలో విద్యుత్ లైన్లు మరమ్మతుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాలలో కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ రంగారావు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11కేవీ రాజపానగల్ రోడ్, గొడుగుపాలెం ఫీడర్లలో గల కోర్టు సెంటర్, సెంట్రల్ కేఫ్, శ్రీగిరికొండ, రాజాపానగల్ రోడ్డు, లేబర్ ఆఫీస్, జమ్మిచెట్టు బజారుప్రాంతాల్లో కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.