VIDEO: ఖిల్లా పై నుంచి భారీ వరద ప్రవాహం
NLG: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చారిత్రక కట్టడమైన దేవరకొండ ఖిల్లా దుర్గం మెట్లపై నుంచి భారీ వరద ప్రవాహం కిందికి వస్తోంది. ఖిల్లా ముఖ ద్వారం గోడలు వర్షానికి నాని ఉండడంతో కొంతమేర శిథిలమయ్యాయి. ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, గోడల సమీపంలో ఉండవద్దని అధికారులు సూచించారు. మెట్లపై వరద వస్తుండటంతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది.