బండ రాయి మీద పడి బాలుడు మృతి

VZM: బాలుడిపై రాయి పడి మృతి చెందిన ఘటన ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నారయణమూర్తి వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన అమీన్ ఖాన్ భవన నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో 4వ అంతస్తు నుంచి రాయి పడవేస్తున్నపుడు అటువైపు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళాడు.రాయి బాలుడి మీద పడడంతో తలకు గాయమైంది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.