అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
HNK: శాయంపేట మండలం మైలారం గ్రామంలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. శాయంపేటకు చెందిన ఓ వ్యాపారి సురేష్ గ్రామంలో కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో ఉన్న బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.