VIDEO: ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా

VIDEO: ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా

AKP: నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ వాహన డ్రైవర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ.. ఉద్యోగులకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్‌లో ప్రభుత్వం వాటా సమకూర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు.