నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30కు కూసుమంచి మండలం నేలపట్ల, ధర్మతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3.30కు తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం, తల్లంపాడులో సీసీ రోడ్, బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.