ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయిస్తా: ఎమ్మెల్యే

NLG: మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం నాంపల్లిలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిబిరంలో మాట్లాడారు. ఉచిత కంటి శిబిరానికి అనుహ్య స్పందన వస్తుందని, అవసరమైన ప్రతి మనిషికి కంటి ఆపరేషన్లు చేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.